![]() |
![]() |

బ్రహ్మముడి సీరియల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ కథలో ట్విస్ట్ లతో ఆసక్తికరంగా సాగుతుంది. అందుకే ఈ సీరియల్ కి తెలుగు రాష్ట్రాలలోనే కాదు అంతటా ఆదరణ ఎక్కువగా ఉంది. కారణం ఈ సీరియల్ లో ప్రతీ మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించేలా ఎమోషన్స్ ని చూపిస్తున్నారు.
మధ్యతరగతి కుటుంబం యొక్క అవసరాలు, వాటి కోసం వారు చేసే అప్పులు, వాటిని తట్టుకోలేక వారు సర్దుకుపోయేతత్వాలు ఇలా అన్ని ఎమోషన్స్ ని కలిపి కనకం-కృష్ణమూర్తిల కుటుంబాన్ని చూపిస్తున్నారు. మరొకవైపు ధనవంతులు సమాజంలో ఎలా ఉంటారు.. వారి అటిట్యూడ్ ఎలా ఉంటుందని, వారు మధ్యతరగతి వాళ్ళని ఎలా చూస్తారనేది దుగ్గిరాల కుటుంబాన్ని ప్రతిబింబించేలా చూపిస్తూ ఈ సీరియల్ ముందుకు సాగుతుంది. కనకం-కృష్ణమూర్తిలకు ముగ్గురు కూతుళ్ళు.. ఒకరు స్వప్న, మరొకరు కావ్య, ఇంకొకరు అప్పు.. కనకం వీళ్ళందరిని గొప్పింటి వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేసి.. మేం పడే కష్టాలు మా పిల్లలు పడకూడదని ఆశపడుతుంటుంది.
అలాగే పెద్ద కూతురు స్వప్న తన తల్లి బాటలోనే ఉండాలనుకుంటుంది. చేసుకుంటే బాగా డబ్బున్న వాడినే చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది. కృష్ణమూర్తి మాత్రం నీతిగా, నిజాయితీగా బ్రతకాలని.. ఉన్నంతంలో హుందాగా బ్రతకాలని వాళ్ళ కూతుళ్ళకి భార్య కనకంకి చెప్తుంటాడు. చివరి అమ్మాయి అప్పు మాత్రం చదువుకుంటూ, పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ తన ఖర్చులకు తను డబ్బులు సమకూర్చుకుంటూ ఎవరికి భారంగా ఉండాలనుకుంటుంది. అయితే తాజాగా జరుగుతున్న సీరియల్ ఎపిసోడ్ లలో కథ పూర్తిగా మలుపు తిరిగింది.
దుగ్గిరాల కుటుంబంలోని అపర్ణ వాళ్ళ కొడుకు రాజ్ కి కనకం కూతురు స్వప్న నచ్చి పెళ్ళిచేసుకుందామనేసరికి తను పెళ్ళిపీటల మీద నుండి లేచిపోతుంది. దాంతో రాజ్ మేనత్త రుద్రాణి కనకం రెండవ కూతురు కావ్యని పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టి రాజ్, కావ్యల పెళ్ళి జరిపిస్తుంది. ఆ తర్వాత స్వప్న, రాహుల్ ల పెళ్ళి జరుగుతుంది. అయితే స్వప్న ప్రెగ్నెంట్ కాదనే విషయం కావ్యకి తెలిసిపోతుంది. కావ్య పెళ్ళి ఆపాలని చూస్తుంది. కానీ అప్పటికే రాహుల్-స్వప్నల పెళ్ళి జరుగుతుంది. అయితే కళ్యాణ్ తన కవితలని ఆరాధించే అనామికని చూసి ఫీధా అవుతాడు. ఆ తర్వాత తను వాళ్ళింటికి కూడా వస్తుంది. కళ్యాణ్ కి దెబ్బతాకిందనగానే అనామిక పరుగెత్తుకుంటూ వాళ్ళింటికి వచ్చేస్తుంది. ఇక అక్కడంతా అనామికని కళ్యాణ్ ప్రేమిస్తున్న అమ్మాయని అనుకుంటారు. కానీ తన కవితల అభిమాని అని కళ్యాణ్ చెప్తాడు. మరొకవైపు సీతారామయ్య కోసం కావ్యతో అన్యోన్యంగా ఉన్నట్లు నటిస్తుంటాడు రాజ్. అయితే రాజ్ అలా కావ్యతో క్లోజ్ గా ఉండటం చూసి అపర్ణకి కోపం పెరిగిపోతుంటుంది. మరొకవైపు రుద్రాణి గ్యాప్ దొరికినప్పుడల్లా అపర్ణకి లేనిపోనివి కల్పించి చెప్పడానికి ట్రై చేస్తుంటుంది. అయితే సీతారామయ్య కోసమే కావ్యని రాజ్ భార్యగా బాగా చూసుకుంటున్నాడనే విషయం కావ్యకి తెలుస్తుందా? అప్పులో మొదలైన మార్పుకి కారణం కళ్యాణేనా లాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ బ్రహ్మముడి సీరియల్ ముందుకు సాగుతుంది. కాగా బుధవారం జరిగిన ఎపిసోడ్ తో ఈ సీరియల్ 200 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. కాగా ఈ సీరియల్ యూనిట్ అంతా కలిసి ఈ స్పెషల్ ఎపిసోడ్ ని గ్రాంఢ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.
![]() |
![]() |